సీన్ రివర్స్ : వైసిపి నేతలతో కలసి బిజెపి ఎమ్మెల్యే ప్రెస్ మీట్..!

Wednesday, January 24th, 2018, 09:22:07 PM IST

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మిత్రపక్షాలైన టిడిపి బిజెపిల బంతిపూల కొట్లాట ఇంకాస్త ముదిరింది. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార రాజు ఏకంగా వైసిపి నేతలతో కలసి ప్రెస్ మీట్ పెట్టేశారు. ఏపీ బీజేపీలో ఉన్న రెండు గ్రూప్ లలో ఈయన చంద్రబాబు వ్యతిరేక వర్గానికి చెందిన వారు. అసెంబ్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు కేబినెట్ పై ఆయన వైసిపి నేతలతో కలసి విమర్శలు చేశారు.

చంద్రబాబు కేబినెట్ లో మంత్రలుగా పదవులు అనుభవిస్తున్న వైసిపి నేతలంతా వెంటనే రాజీనామా చేయాలని అల్టిమేటం జారే చేశారు. లేకుంటే పార్టీ పిరాయించిన వారు కూడా మంత్రలు ఆయ్యేల్లా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. విష్ణుకుమార్ రాజు దూకుడు ఏంటో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. భూమా అఖిల ప్రియా, ఆదినారాయణ రెడ్డి వంటి వైసిపి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకుని మంత్రులు అయిన వారే. జగన్ తో కలసి పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న బిజెపి నేతల్లో విష్ణుకుమార్ రాజు కూడా ఒకరు. ఆయన ఏకంగా వైసిపి నేతలతో కలసి ప్రెస్ మీట్ పెట్టేయడం సంచలనంగా మారింది.