యువతిపై బీజేపీ ఎమెల్యే లైంగిక దాడి..

Monday, April 9th, 2018, 08:46:27 PM IST


తనపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ ఎమ్మె ల్యే లైంగికదాడి చేశాడని ఓ యువతి ఆరోపించారు. తనకు న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ లక్నో లోని సీఎం యోగి ఆ దిత్యనాథ్ ఇంటి ముందు కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఊనా బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగర్, ఆయన సోదరుడు గతేడాది జూన్‌లో నాపై లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా బెదిరింపులు మొదలయ్యాయి. నిందితులను అరెస్టు చేయాలని, లేకుంటే నాకు ఆత్మహత్యే శరణ్యం అని తెలిపారు. ఇది తనను అప్రతిష్ట పాల్జేయడానికే విపక్షాలు పన్నిన కుట్ర అని కుల్‌దీప్ సింగ్ సెంగర్ ఆరోపించారు.

  •  
  •  
  •  
  •  

Comments