వీడియో : పన్ను కట్టమంటే పళ్లు రాలగొట్టాడు.. బిజేపి నేత ఓవరాక్షన్!

Saturday, March 17th, 2018, 07:31:41 PM IST

ఈ మధ్య కాలంలో ఎక్కువగా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడులు చేయడం చాలా కామన్ అయిపొయింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు వారి అనుచరులు టోల్ గెట్ వద్ద టాక్స్ కట్టమంటే.. కోపంతో సిబ్బందిపై దాడులు చేస్తున్నారు. వారి కంప్యూటర్లను కూడా ద్వాంసం చేయడానికి సిద్దపడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఓ బిజేపి నేత రాహుల్‌ దేవ్ అగ్నిహోత్రి తన కుమారుడితో కలిసి అక్బర్‌పూర్‌లోని టోల్ ప్లాజ్ సిబ్బందిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అదే తరహాలో రాజస్థాన్‌లోని ఓ ఎమ్మెల్యే కూడా ఇటీవల టోల్ గెట్ సిబ్బందిపై దాడి చేశాడు. గరీహ్ విధాన్ సభ బీజేపీ ఎంఎల్ఏ జీత్‌మల్ కాంత్ హైవే పై వెళుతూ.. టోల్ ప్లాజా ఉద్యోగిపై దాడి చేశారు. ఏ మాత్రం ఆలోచించకుండా అనుచరులతో కలిసి అడ్డుకున్న సిబ్బందిపై కూడా దాడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ కూడా ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి పన్ను కట్టకుండా దాడి చేయడం దారుణమని అతనిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.