కెసిఆర్ మీద వెల్లువెత్తున్న విమర్శలు..!

Thursday, October 4th, 2018, 01:28:12 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని ముందస్తు ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీల వారు వారి వ్యూహాలకు పదును పెడుతున్నారు.బీజేపీ మినహా ఇతర పార్టీలు అన్ని,ఒక సమూహంగా మారి,బీజేపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుంది.ఏ పార్టీ వారు ఐనా సరే ఇప్పుడు తెలంగాణలోని వారి ప్రధాన లక్ష్యం తెరాస పార్టీ మరియు మరియు కెసిఆర్.నిన్ననే జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు వచ్చినటువంటి ప్రజలకు బహిరంగంగానే డబ్బులు పంచారని ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇప్పుడు తాజాగా కెసిఆర్ మీద బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.వారు తెలంగాణా రాష్ట్రం కోసం చేసిన త్యాగాలకు గాను ప్రతిఫలంగా 2014 ఎన్నికలలో ప్రజలు వారికి సరైన న్యాయం చేసారని,కానీ దానికి బదులుగా కెసిఆర్ తెలంగాణా రాష్ట్ర ప్రజలను ముంచేస్తున్నారని తెలిపారు.కెసిఆర్ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుటుంబీకులుకి తప్ప ఇంకా వేరే ఎవ్వరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.లక్షల స్థాయిలో ఉద్యోగాలను విడుదల చెయ్యాల్సింది పోయి కేవలం 17వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని,తెరాస అధికారంలోకి వస్తే దళిత సోదరుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి తానే కుర్చీ లాక్కున్నారని,రైతులకు దళితులకు,విద్యార్థులకు అన్యాయం చేశారని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.