తెలుగు డ్రామా పార్టీ మళ్ళీ రంగు పులుముకోవాల్సిందే..!

Wednesday, October 10th, 2018, 03:00:26 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను చూసుకున్నట్టయితే టీడీపీ మరియు బీజేపీ పార్టీల వారు ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుతున్నారు అనే చెప్పాలి.కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన నిధుల పట్ల ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు అందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కావాలనే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అని విమర్శిస్తున్నారు,దానికి గాను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత రెండు మూడు ఏళ్ళల్లో ఎప్పుడు విడుదల చేయనటువంటి నిధులను కేవలం ఈ ఆరు నెలల్లోనే విడుదల చేసినా సరే వీరు ఎందుకని గుర్తించట్లేదని మండిపడ్డారు.అంతే కాకుండా వీరు చేస్తున్నటువంటి ఈ ఆరోపణల వల్ల వారి యొక్క హుందాతనాన్ని కోల్పోతున్నారని తెలిపారు.చంద్రబాబు నాయుడుకి చేసేది తక్కువ ఆర్భాటం ఎక్కువని సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ పార్టీ తెలుగు డ్రామా పార్టీ అని అందరికి తెలుసనీ,మొన్న పార్లమెంటు దగ్గర డ్రామాలు ఆడారని,ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని పేర్కొన్నారు.ఇప్పుడు వస్తున్న సర్వేల్లో టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని,ఇక వారు మళ్ళీ డ్రామాలు వేసుకుంటూ మొహానికి రంగు పులుముకోవాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.