సెలబ్రెటీలపై కన్నేసిన బీజేపీ!

Friday, April 13th, 2018, 09:39:30 AM IST

గత కొంత కాలంగా దేశ రాజకీయాల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎంత బలంగా ఉండేదో ఇప్పుడు అంత కంటే ఎక్కువగా బలహీనపడుతోంది. సౌత్ లో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం పడుతోన్న కష్టం అంతా ఇంతా కాదు. అయితే ఎన్ని ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ అనుకున్నంత రేంజ్ లో బీజేపీ కి గుర్తింపు రావడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో నిర్లక్ష్యం వహించడంతో పార్టీపై ప్రభావం చాలానే కనిపించింది.

నార్త్ లో కూడా ఇప్పుడు బీజేపీ బలహీనపడుతోంది అనే టాక్ గట్టిగా వస్తోంది. మొన్నటి వరకు బాలంగా ఉన్నాయనుకున్న స్థానాలు కూడా ఇప్పుడు ఇతరులు దక్కించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో బిజెపి కి భారీ దెబ్బ పడనుందా అనే రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే బీజేపీ అధిష్టానం ఎంత మాత్రం అధికారాన్ని వదులుకోకూడదని ప్లాన్స్ వేస్తూనే ఉంది. ముఖ్యంగా మాజీ క్రికెటర్స్ ని రంగంలోకి దింపాలని అనుకుంటోంది. రాహుల్ ద్రావిడ్ – అనిల్ కుంబ్లే వంటి సీనియర్ క్రికెట్ దిగ్గజాలను పార్టీలోకి ఆహ్వానించి యువతను వారివైపు తిప్పుకోవాలని చూస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారికంగా ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. క్రికెటర్స్ కూడా ఈ రూమర్స్ ఎంతవరకు నిజం అనే దానిపై క్లారికి ఇవ్వలేదు. కానీ బీజేపీ మాత్రం సెలబ్రెటీలు పార్టీలోకి రావాలనుకుంటే ఏ మాత్రం అడ్డు చెప్పకూడదు అనే తరహాలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.