తెలంగాణపై కన్నేసిన బీజేపీ!

Wednesday, May 16th, 2018, 08:21:54 AM IST

భారత జనతా పార్టీ ప్రణాళికలు రచించడంలో నెంబర్ వన్ అని మరోసారి నిరూపించింది. కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న కర్ణాటక ఎన్నికలో అందరికంటే ఎక్కువ స్థానాలను బీజేపీ అందుకొని మొదటి స్థానంలో నిలిచింది. అసలు బీజేపీ రచించే ప్లాన్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అనే విధంగా ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామా స్థాయి నుంచి జనాలను ఆకర్షించే విధంగా ప్లాన్ వేశారు. బూత్ స్థాయి కమిటీల నుంచి పార్టీని బలపరిచారు. కర్ణాటక లో పెద్దగా వ్యతిరేకత లేని సిద్దరామయ్య పై గెలిచి పంతం నెగ్గించుకున్నారు అంటే వారి ప్రణాళికలు ఏ స్థాయిలో వర్కౌట్ అయ్యాయో తెలుస్తోంది.

ఇక అదే స్థాయిలో 2019 ఎలక్షన్స్ లో వీలైనంత వరకు రాష్ట్రాలను దక్కించుకోవాలని బీజేపీ అధిష్ఠానం ఆలోచిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ పై కూడా బీజేపీ కన్నేసినట్లు తెలుస్తోంది. తెలంగాణాలో టీఆరెస్ స్ట్రాంగ్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మొదట కేసీఆర్ పార్టీకి పోటీ ఇచ్చే విధంగా కనీసం ప్రతి పక్ష హోదానైనా అందుకోవాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మినిమమ్ 50 స్థానాలను గెలుచుకోవాలని ఆ స్థానాల్లో బీజేపీ క్లిన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉందని వారి నమ్మకం. అందుకోసం సరికొత్త ప్లాన్స్ ను బీజేపీ అధిష్టానం ఆచరణలో పెట్టనుంది. అమిత్ షా కూడా మరికొన్ని రోజుల్లో తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులని తెలుసుకొని పర్యటన చేయాలనీ అనుకుంటున్నారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కూడా ప్రచార రంగంలోకి దింపాలని చూస్తున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments