ప్రతిపక్ష పార్టీతో పొత్తా చాన్సే లేదు: సదానంద

Tuesday, May 15th, 2018, 12:55:29 PM IST

కర్ణాటక ఎన్నికల ఫలితాల తీరు రాష్ట్రంలో జోరందుకుంది. మొదటి విడుతలో భాజాపాతో పొటీ పడుతూ ఉవ్వేత్తున ఎగసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలు రెండవ విడుత ఫలితాల విషయానికి వచ్చేసరికి తారా స్థాయిలో పడిపోయింది. చివరి ఫలితాల దగ్గరికి వచ్చేసరికి భాజాపా 105కు దగ్గరలో ఉండగా కాంగ్రెస్ మాత్రం సుమారు 75 కు మించి ముందుకు వెళ్ళడం లేదు. ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా ప్రస్తుతానికి జేడీఎస్ మాత్రం మూడవ స్థానంలో నిలిచింది. అయితే కొద్ది సేపటి క్రితం పత్రికా విలేకరులు జేడీఎస్ పార్టీతో పొత్తు విషయమై బీజేపీ పార్టీ నేత అయిన సదానంద గౌడతో చర్చించారు. ఈ చర్చలో సదానంద విలేకరులతో మాట్లాడుతూ జేడీఎస్ తో పొట్టు కూడడానికి మీకు సమ్మతమేనా అని అడగగా బీజేపీ ప్రతిపక్ష పార్టీ అయినా లేక వేరే ఇతర పార్టీ అయినా పొత్తు కూడడానికి అస్సలు ఒప్పుకోదని… ఈ విషయానికి సంబంధించి ఎవ్వరికీ చాన్సు ఇవ్వబోమని తెలిపారు.

బీజేపీ ఇప్పటికే 113 కు చేరిందని ఇలాంటి సమయంలో మాకు వేరే పార్టీతో పొత్తు కూడె అవసరమే లేదని, తమకు తాము స్వంతంగా కర్ణాటక రాష్ట్రంలో పార్టీ ఏర్పరచుకునే సత్తా ఉందని కచ్చితంగా త్తాము ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రానికి బీజేపీ ఇంచార్జ్ గా పనిచేస్తున్న మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా బెంగళూర్ తిరోగమనం చేశారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలోని బీజేపీ ముందంజలో ఉండటం వలన మునుముందు జరిగే పరిణామాలను దగ్గరుండి చూసుకోవడం కోసం ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. వీటన్నిటికంటే ముందు బీజేపీ పార్టీ జాతీయ అద్యక్షుడైన అమిత్ షా ను ఆయన నివాస స్థలంలో కలిసి గెలిచినా ఓడినా దాని తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాల గురించి చర్చించి వచ్చారు. ఇక చివరి ఫలితాల్లో బీజేపీ ఏ స్థానంలో ఉంటుందా అసలు జేలుస్తునా ఓడిపోతుందా అన్న విషయం కోసం వేచి చూడాల్సిందే.

Comments