ఏపి వల్ల బిజేపి గుండెల్లో గుబులు..

Saturday, March 17th, 2018, 09:28:23 AM IST

మిత్రపక్ష రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగవని మరోసారి రుజువైంది. పార్టీ మనుగడను కాపాడుకునేందుకు చేసే ఈ తరహా రాజకీయాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనే విషయం ఎవ్వరికి తెలియదు. అయితే కలిసి ఎన్నికలలో పోటి చేసినా ఎక్కడో ఒక చోట అగ్గి రాజుకుంటూనే ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. చాలా కాలం తరువాత కాంగ్రెస్ ను గద్దె దించి దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అందుకోసం బీజేపీ పెద్దలు ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బలంగా లేని రాష్ట్రాల్లో వేరే పార్టీలతో చేతులు కలిపి ఎట్టకేలకు మద్దతు అందుకుంది. అమిత్ షా మోడీ ఆలోచనలు బాగానే సక్సెస్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కారణంగా బిజెపి గుండెల్లో గుబులు రేగుతోంది. ఎన్డీయే ప్రభుత్వంలో చీలికలు వచ్చే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే తెలుగు దేశం పార్టి కటీఫ్ చెప్పేసి అవిశ్వాస తీర్మానానికి సై అంది.

ఇదే తరహాలో ఇతర పార్టీలు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర శివసేన బీజేపీ తో ఇక నుంచి కలిసే ఆలోచన లేదని గట్టిగా చెప్పేసింది. మరికొందరు కూడా బీజేపీతో తెగ దెంపులు చేసుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు అందరు రివర్స్ అయితే బీజేపీ కి ఎఫెక్ట్ తప్పదు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ మాత్రం ప్రభావం చూపకపోవచ్చు. దీంతో అమిత్ షా సైన్యం రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీతో విడిపోవాలి అనుకుంటున్న స్థానిక పార్టీలతో చర్చలు జరుపున్నట్లు తెలుస్తోంది. మోడీ కూడా అందుకోసం ప్రత్యేకంగా కొన్ని ప్లాన్స్ వేస్తున్నారని టాక్. అమిత్ షా గత ఎన్నికల్లో అందరిని కలుపుకుని వెళ్లారు. ఇప్పుడు ఆయన మళ్లీ ఇతరులను బ్రతిమలే పనిలో పడ్డారు. కానీ ఈ సారి ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదని తెలుస్తోంది. బీజేపీ తో ఇప్పుడు కలిసి ఉంటే వచ్చే ఎలక్షన్ లో తమకి ఎఫెక్ట్ అని మిత్రపక్షంగా ఉన్న పార్టీలు ఎంత బ్రతిమాలినా బీజేపీ కి మద్దతు ఇవ్వడం లేదట. బీజేపీ కి ఈ సమస్య వచ్చింది ఇప్పుడు ఏపి కారణంగానే.. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఆ పార్టీకి మంచి గుర్తింపు వచ్చేదని సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు.

జాతీయ వార్తలు