పవన్ ను విమర్శించిన వారికి అమిత్ షా క్లాస్..?

Wednesday, September 21st, 2016, 12:20:24 PM IST

amith-shah
ఈ మధ్య కాలంలో పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి బిజెపి నేతలు చంద్రబాబు పై సుతి మెత్తనైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టిడిపి ఎన్డీయే లో బాగా స్వామి అయినా వీరు చంద్రబాబు పై విమర్శలు చేసారు. దీనికి కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ వైసిపి అధికారం లోకి వస్తే జగన్ ను ఎన్డీయే లోకి ఆహ్వానించాలన్నది వీరి ఆలోచనగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఎప్పటికైనా జగన్ తో స్నేహం చేయాలన్నది కొందరి ఎపి బిజెపి నేతలు ఆలోచన.

అయితే వారి ఆలోచనలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అడ్డుకట్ట వేశారని చర్చ నడుస్తోంది.జగన్ తో స్నేహం వద్దని, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుతో స్నేహాన్ని వదులుకోవద్దని ఏపీ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.దీనివల్లనే ఇటీవల పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి వారు చంద్రబాబు పై స్వరం తగ్గించారు.కాకినాడ సభలో పవన్ ప్రసంగానికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన బిజెపి నేతలు అమిత్ షా పీకిన క్లాస్ అనంతరం మెత్తబడ్డట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీయే కి మిత్రుడే అని వారికి వివరించినట్లు సమాచారం. చంద్రబాబు ప్యాకేజీని అర్థం చేసుకున్నట్లు పవన్ కూడా అర్థం చేసుకోవాలని మెత్తగా సోమువీర్రాజు వ్యాఖ్యానించడం అమిత్ షా పీకిని క్లాస్ ఫలితమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.