సభ పెట్టి మరీ టిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన బీజేపీ !

Sunday, September 16th, 2018, 03:23:56 PM IST

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో తెలంగాణల్లో ఒంటరిగా పోటీ చేస్తాం అంటూ అమిత్ షా ప్రకటించారు కానీ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాన్య జనానికి కాదు పార్టీ శ్రేణులకు కూడ అర్థంకాలేదు.

గత ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ ప్రకటించి మాట తప్పారని, ఆయన కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని స్పీచ్ అందుకున్న అమిత్ షా కనీసం 2018లోనైనా దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నను ఒకటికి పదిసార్లు వింటే అందులో రాబోయే ఎన్నికల్లో మీరే గెలుస్తారు కదా కేసీఆర్.. అప్పుడైనా దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అన్న అర్థం వినబడుతోంది.

అంటే ఈసారి కూడ టీఆర్ఎస్ గెలుపు ఖాయమని బీజేపీ ఇప్పటికే నిర్ణయించేసుకున్నట్టు అర్థమవుతోంది. మరి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు వాళ్ళు ఇవ్వబోయే పోటీ ఎంతవరకు బలంగా ఉంటుందన్నది ప్రశ్నార్ధకమే.

  •  
  •  
  •  
  •  

Comments