ఇక రాజకీయ సన్యాసం తీస్కుంటున్నా : గుడ్ బై బీజేపీ

Sunday, April 22nd, 2018, 12:54:14 AM IST

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సినియర్ నేత యశ్వంత్ సిన్హా ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రభుత్వానికి, మీడియాకు ప్రకటించారు. కొద్దిరోజులుగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్న వార్తలు తెలిసినవే. అయితే తాజాగా బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు యశ్వంత్ సిన్హా వెల్లడించారు.

ఈ రోజు బీజేపీతో ఉన్న అన్ని అనుభంద సంబంధాలను జీవుతాంతం ఎలాంటి ఆనవాళ్ళు ఉండకుండా తెగతెంపులు చేసుకుంటున్నాను. తాను పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటానని, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాని పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన అనూహ్య‌ ప్రకటన చేశారు. సిన్హా 1998 నుంచి 2004 మధ్య మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బీజేపీ నుంచి తప్పుకుంటున్నా. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలను మీరంతా చూశారు. చరిత్రలోనే అతి తక్కువ సమయం మాత్రమే సభ సజావుగా జరిగిందని తెలిపారు.

సిన్హా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర మంచ్ స‌మావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు, లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ నాయ‌కులు, బీజేపీ సీనియర్ నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా ఇందులో పాల్గొన్నారు. యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments