బీజేపీలో రజినీకాంత్ ఫిక్సయినట్టే?

Saturday, September 8th, 2018, 05:57:28 PM IST

తమిళనాడులో ఈ సారి సినీ రాజకీయ ప్రభావం బాగానే కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన అనంతరం తమిళనాడులో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు కమల్ హాసన్ తన పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అనుకుంటున్నాడు. ఇకపోతే రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎప్పుడు వస్తారా? అని అభిమానులతో పాటు దేశమంతట ఎదురుచూస్తోంది.

అయితే రజినీకాంత్ మాత్రం ఇంకా ఎలాంటి కార్యాచరణను మొదలు పెట్టలేదు. ప్రస్తుతం వినిపిస్తోన్న రూమర్స్ ప్రకారం ఆయన భారత జనతా పార్టీలోకి అడుగుపెట్టే ఆలోచనలోనే ఉన్నారని తెలుస్తోంది. గత కొంత కాలంగా రజినీ భాజపా జాతీయ కార్యదర్శి అమిత్ షాతో చర్చలు జరుపడం అందరికి తెలిసిందే. పైగా మోడీ వచ్చినప్పుడు కూడా రజినీతో స్పెషల్ గా మాట్లాడటం చూస్తుంటే తమిళ రాజకీయ జాతీయ పార్టీ కమలం జెండా ముఖ్య పాత్ర పోషిస్తుందని టాక్ వస్తోంది. ఒంటరిగా నిలబడినా కూడా రజినీకాంత్ తమిళ రాజకీయాల్లో తప్పకుండా నిలబడగలడని చెప్పవచ్చు. ఆయనకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం బీజేపీ ప్రతి రాష్ట్రంలో సినీ తరాల ప్రభావం ఉండేలా చేసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పుడు రజినీకాంత్ పై కన్నేసిందని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments