ఇప్పుడు బీజేపీ టార్గెట్ తెలంగాణ!

Monday, June 11th, 2018, 07:27:07 PM IST

పాలిటిక్స్ లో విజయం సాదించాలి అంటే ముందుగా చెప్పుకోవాల్సింది పార్టీని సమగ్రతతో నడిపించడం. ముఖ్యంగా పార్టీని సరైన దారిలో ప్రజల దృష్టికి తీసుకెళ్తే ఆటోమేటిక్ గా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. ఒక్కసారి క్లిక్ అయితే మళ్లీ చీకట్లోకి వెళ్లే సమస్యే ఉండదు. ఇవన్నీ జరగాలంటే శకునికి మించిన ఎత్తులు తెలిసిన ఒక నాయకుడు ఉండాలి. పాజిటివ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లి వెనుక నుంచి ఎవరు ఊహించని ఎత్తులు వెయ్యాలి. దాదాపు ప్రతి పార్టీలో అలాంటి నాయకులూ ఉంటారు

బీజేపీలో కూడా గత కొన్నేళ్లుగా ఓ నాయకుడు ఉన్నాడు. అతనే అమిత్ షా. తన తెలివితో పార్టీ స్థాయిని పెంచుతూ ప్రతి ఎలక్షన్ లో భారత జనతా పార్టీ అధికారాన్ని సొంతం చేసుకునేలా వ్యూహ రచన చేస్తున్నాడు. కానీ ఇటీవల కర్ణాటక లో మాత్రం అతను వేసిన ప్లాన్స్ సక్సెస్ అయినప్పట్టికి అధికారాన్ని అందుకోలేదు. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. పార్టీ అధ్యక్షుడికి అమిత్ షా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చేసిన కృషి ఎంతో ఉంది. అంతకు ముందు వరకు పోటీ చేసిన ప్రతి ఎలక్షన్ లో అమిత్ షా తన తెలివితో అధికారాన్ని సొంత చేసుకొని ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.

ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం అమిత్ షా ద్రుష్టి మొత్తం తెలంగాణ పై పడింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని ఎలా అయినా ఓడించి బిజెపి ని అధికార హోదాలో నిలబెట్టాలని అమిత్ షా పావులు కదుపుతున్నారు. సీఎం కేసీఆర్ ని ఓడించడం అంత సులువైన పని కాదని బిజెపి అధినేతలకు తెలుసు. అందుకే ప్రజలను బాగా ఆకర్షించాలని పర్యటనలు జరపడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 22 నుంచి హైదరాబాద్ లో భారీ స్థాయిలో పర్యటన నిర్వహించనున్నారు. అందుకోసం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఏర్పాట్లు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments