సభలు జరగలేదు.. నేతలకు జీతాల్లేవ్!

Thursday, April 5th, 2018, 10:12:00 AM IST

ప్రస్తుత రోజుల్లో నాయకులు చర్చలు జరిపే సమావేశాలు ఎంత దారుణంగా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజాసమస్యలను పట్టించుకోకుండా ఒక్క విషయం చుట్టూ వేలాడుతూ ప్రజాధనాన్ని చాలానే వృధా చేస్తున్నారు. గత కొంత కాలంగా పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో అందరికి తెలిసిందే. ఓ వైపు తెలుగు దేశం పార్టీ నేతల నిరసనలు మరో వైపు తమిళనాడు అన్నాడీఎంకే కావేరి నది జలాల నినాదాలతో సభాను హోరెత్తిస్తున్నారు. దీంతో స్పీకర్ కూడా ఆంధ్రప్రదేశ్ నాయకుల ప్రత్యేక అంశాన్ని పట్టించుకోవడం మానేశారు.

అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ చర్చకు అవకాశం ఇవ్వకపోవడం రోజు జరుగుతూనే ఉంది. రోజు మలివిడత సమావేశాలు వాయిదా పడుతుండడం కామన్ అయిపొయింది. చాలా సమయాన్ని నేతలు వృధా చేశారు. దీంతో బీజేపీ ‘నో వర్క్ నో పే’ విధానాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ విధమైన చర్చ లేకుండా సాగినందుకు గాను ఈ 23 రోజుల వేతనం అలాగే ఎలాంటి భత్యాలను తీసుకోరాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో నరేంద్ర మోడీ ఈ విషయం గురించి పదే పదే తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎంపీలు వదులుకునే జీతాలు పేదల సంక్షేమ నిధులలో చేరుస్తామని అనంత్ కుమార్ వెల్లడించారు.

  •  
  •  
  •  
  •  

Comments