పివి, అటల్ జీ చావుల్ని క్యాష్ చేసుకుంటున్న బీజేపీ !

Thursday, October 11th, 2018, 11:40:00 AM IST

మన రాజకీయ నాయకులు పూర్తిగా నైతికతను విస్మరించారు. అన్ని అంశాలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకుల చావుల్ని సైతం క్యాష్ చేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడటంలేదు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన సమరభేరి సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ ప్రయత్నం చేశారు. అధికార తెరాసాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రాసెస్లో ప్రముఖులు, మాజీ ప్రధానులు అటల్ బిహారి వాజ్ పేయి, పివి నరసింహారావుల మరణాల్ని, అంత్యక్రియలను ప్రస్తావించారు షా.

కాంగ్రెస్ ను ఎండగట్టే యత్నంలో విలువల్ని పక్కనబెట్టి ఇటీవల అటల్ జీ మరణిస్తే ప్రధాని మోడీ ఢిల్లీలో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నరసింహారావు మరణిస్తే ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించనీయలేదు, కనీసం ఆయన పార్థివదేహాన్ని పార్టీ కార్యాలయానికి కూడా తీసుకురానివ్వలేదు సోనియా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పీవీని అవమానించారని కంక్లూడ్ చేస్తూ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు నిలదీయాలి అంటూ విస్మయపరిచారు.

అలాగే తెలంగాణ ఒవైసీ కబంధ హస్తాల్లో ఉందని, వారి నుండి రాష్ట్రాన్ని కాపాడగలిగేది ఒక్క బీజేపీ మాత్రమేనని హిందూత్వ వాదాన్ని రెచ్చగొట్టడానికి యత్నించారు. మొత్తానికి అమిత్ షా వ్యవహారం చూస్తుంటే అధికారాన్ని దక్కించుకోటం కోసం గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వేసిన వేషాలే తెలంగాణలో కూడ వేయాలని ప్లాన్ వేసిన్నట్టున్నారు.