మరొక స్వామీజీని పైకిలేపుతున్న బీజేపీ !

Monday, October 8th, 2018, 04:29:08 PM IST

హిందూత్వ శక్తులని ప్రోత్సహించడంలో బీజేపీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎక్కడ అనుకూలత ఉన్నా తమలోని ఈ పైత్యాన్ని ప్రదర్శించడానికి బీజేపీ అధిష్టానం ఏమాత్రం సిగ్గు పడదు. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిని చేసి, జబ్బలు చరుచుకున్న బీజేపీ మరొక స్వామీజీని హైలెట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయనే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద.

మొదటి నుంచి ఈయనకు అనేక సందర్బాల్లో అండగా నిలుస్తూ వచ్చిన బీజేపీ ఈసారి ఆయన్ను ఏకంగా ప్రత్యేక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని ట్రై చేస్తోంది. ఈ మేరకు పరిపూర్ణానందకు ఢిల్లీ నుండి పిలుపు కూడ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో అమిత్ షాను కలిసే పనిలో ఉన్నారు.

రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు తెలంగాణాలో ఒంటరిగా పోటీ చేస్తున్న తమకు సరైన సిఎం అభ్యర్థి లేని కారణంగా పరిపూర్ణానందను ఆ స్థానంలోకి తేవాలని ఒకవేళ అది కుదరకపోతే కనీసం ఎంపీ స్థానం నుండైనా ఆయన్ను పోటీకి దించాలని బీజేపీ అధిస్థానం భావిస్తోందట. ఈ ప్రాసెస్లో ఆదిత్యనాథ్ విషయంలో ఫాలో అయిన పద్ధతులనే ఫాలో అవ్వాలని చూస్తోందట బీజీపీ.