దత్తన్నా.. మీ మాట విని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందా ?

Friday, September 21st, 2018, 03:50:48 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెంగాణలో సానుకూల ఫలితాలు అందుకోలేకపోవడం విభజనతో ఆంధ్రాలో ప్రజల తిరస్కారానికి గురై కనీస ఉనికిని కూడ కోల్పోయే పరిస్థితి రావడంతో కాంగ్రెస్ గత నాలుగేళ్లుగా అసహనంతో రగిలిపోతోంది. ఈసారైనా తెలంగాణ సాధనలో తమదే మేజర్ క్రెడిట్ అని నిరూపించుకోవాలని కిందా మీదా పడుతోంది.

ఇలాంటి తరుణంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర సాధన తమ వలనే సాధ్యమైందని డబ్బా కొట్టుకుంటుండటం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గులాం నబీ ఆజాద్ మాటలకు కౌంటర్ ఇస్తూ తెలంగాణ రావడనికి కారణం కాంగ్రెస్ కాదని తామేనని బల్లగుద్ది చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కేసిఆర్ మాటని కాంగ్రెస్ వినలేదని, అప్పుడు బీజేపీ ప్రత్యేక తెలంగాణ తీర్మానం చేసిందని, దాంతో కాంగ్రెస్ తలొగ్గి మరీ తెంగాణను ప్రకటించిందని చెప్పుకొచ్చారు. స్వార్థం కోసం చెప్పుకునే మాటలే అయినా కొంత నిజాయితీ ఉండాలంటారు. కానీ బద్ద శత్రువు కాంగ్రెస్ తమ తీర్మానానికి లొంగి రాష్ట్రాన్ని ఇచ్చింది అని దత్తన్న చెప్పే మాటల్లో ఆ నిజాయితీ ఇసుమంత కూడ కనిపించడంలేదు. మరి ఇదే మాటను బీజేపీ నేతలు ఆంధ్రలో సభ పెట్టి మేం తీర్మానం ఇస్తేనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని ప్రకటించగలరేమో దత్తాత్రేయగారినే అడగాలి.