80 కంటే 70 ఎక్కువ.. నవ్వులపాలైన బీజేపీ లెక్క!

Tuesday, September 11th, 2018, 10:33:02 AM IST

రాజకీయాల్లో ఉన్న వారికి కష్టపడే గుణం తో పాటు ఆలోచన విధానం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు వీలుగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు తాము గొప్ప అని చెప్పుకునే విధానంలో పొరపాట్లు జరుగుతుండడం కామన్. అయితే పొరపాటు మరి దారుణంగా ఉంటే విమర్శలు ఎదుర్కోకతప్పదు. రీసెంట్ గా భారత జనతా పార్టీ అధికారిక సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి వచ్చిన ఒక ట్వీట్ చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. కాంగ్రెస్ పై సెటైర్ వేయాలని వారు చేసిన ప్రయత్నం చిన్నపిల్లలు సైతం నవ్వుకునేలా ఉంది.

లెక్కలు రానివారు దేశాన్ని ఏలుతున్నారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేఖంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే అందుకు బీజేపీ కౌంటర్ ఇవ్వాలని పెట్రోలు సూచీకి సంబందించిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో డిల్లీ మే 2014 లీటరు పెట్రోలు ధర రూ. 71.41 అని ఉంది.
ఇప్పుడున్న ధర రూ.80.73గా ఉన్నట్టు చూపించారు. అంతా బాగానే ఉంది గాని 80 కంటే 70 ఎక్కువ అన్నట్లు చూపించడంతో నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. లెక్కలు రానివారు దేశాన్ని ఏలుతున్నారు అంటూ మరికొందరు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments