శబరిమల ఇష్యూను క్యాష్ చేసుకునే చీప్ ఆలోచనలో బీజేపీ !

Wednesday, October 17th, 2018, 01:33:07 PM IST

కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల దేవస్థానంపై సుప్రీం కోర్టు 10 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న ఆడవారిని కూడ దైవ దర్శనానికి అనుమతించాలని ఇచ్చిన తీర్పును కేరళ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాలని కంకణం కట్టుకోగా బీజేపీ, శివసేనలు మహిళల్ని దేవాలయంలోకి అనుమతించమని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సుప్రీం తీర్పును ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

కానీ బీజేపీ, శివసేన కార్యకర్తలు దైవ దర్శనానికి వెళ్తున్న మహిళల్ని అడ్డుకుంటున్నారు. అడ్డుకుంటున్న, నిరసనలు చేస్తున్న బీజేపీ కార్యకర్తల్లో సగం మంది మహిళలే ఉండటం గమనార్హం. మహిళా సాధికారతకు పెద్ద పీఠ వేస్తామని గొప్పలు చెప్పే బీజేపీ ఇలా మహిళా వివక్షను ఖండించేలా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దిక్కరించడం విడ్డూరంగా కనిపిస్తోంది.

సుప్రీమ్ ఇచ్చిన తీర్పు ఎంత న్యాయబద్దంగా ఉన్నా అది కేరళలోని చాలా మంది భక్తులకు సహించడం లేదు. వాళ్లంతా ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సిఎం పినరాయి విజయన్ పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్నే అదునుగా తీసుకున్న బీజేపీ అసహనంగా ఉన్న భక్తుల తరపున తమ మహిళా కార్యకర్తల చేత నిరసనలు చేయిస్తూ వారిని తన వైపుకు తిప్పుకుని భవిష్యత్తులో రాజకీయా ప్రయోజనం పొందాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇలా దేవుడ్ని అడ్డుపెట్టుకుని, భక్తుల మనోభావాల్ని తమకు అనుకూలం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ చర్య నిజంగా దిగజారుడు రాజకీయమే.

  •  
  •  
  •  
  •  

Comments