బీజేపీ vs టీడీపీ ఎవరి వాదన కరెక్ట్ ?

Tuesday, July 10th, 2018, 04:57:10 PM IST

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలకు దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు తమ పార్టీలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ పార్టీ నేతలను గెలుపు గుర్రాలుగా తాయారు చేసే పనిలో వారి వారి వ్యూహాలను రచిస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో విభజన హామీలు, మరియు ఏపీకి ప్రతేయక హోదా విషయమై తమను మోసం చేసిన ఎన్డీయేలోని బీజేపీ నుండి బయటకు వచ్చిన టిడిపి నేతలు ఆ పార్టీపై నిప్పులు కక్కుతున్నారు. ఏపీకి ఇస్తామన్న నిధులను ఏ మాత్రం ఇవ్వకుండా, అడిగిన దానిలో పదవ వంతుకూడా ఇవ్వలేదనేది టీడీపీ వాదన, అయితే అది పూర్తిగా అసత్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మా నుండి రకరకాలుగా లాభాలు పొంది ఇప్పుడేమో ఏమి ఎరగనట్లు మాట్లాడం సబబు కాదని వారు వాదిస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయమై కూడా కేంద్రం ఏ మాత్రం సాయమందించేలా వ్యవహరించలేదని, రాష్ట్ర నిధులనుండి చంద్రబాబు ప్రాజక్టు పనులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని టిడిపి అంటుంటే, అసలు మోడీ కరుణించనిదే ఇప్పట్లో పోలవరం పూర్తి చేసే అవకాశం టీడీపీ వారికీ వచ్చి ఉండేది కాదని వారు అంటున్నారు.

అయితే అసలు ఇందులో ఎవరిది నిజమనే విషయమై ఓవైపు ప్రజలు, మరోవైపు విశ్లేషకులు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. కాగా వాస్తవానికి గత ఎన్నికల సమయంలో ఏపీ కొన్ని వేల కోట్ల లోటు బడ్జెట్లో వున్న విషయం అందరికి తెలిసిందే. ఇంత లోటు బడ్జెట్ లో కూడా బాబు ప్రజా సమస్యలను ఏ మాత్రం పక్కన పెట్టకుండా నిపుణులు, మరియు ఆర్ధిక వేత్తలతో చర్చించి సమస్యలను ఎప్పటికపుడు తీర్చుకుంటూ వెళ్తున్నారు అనేది కొంతవరకు వాస్తవమనేది ఒప్పుకుని తీరవలసిన విషయమట, మరోవైపు కేంద్రం వారు కూడా ఏపీ విషయమై కొంత సాయము అందించినట్లు చెపుతున్నారు. ఇకపోతే తాము పోలవరానికి కేటాయించిన నిధుల విషయమై యుసి లను అడుగుతుంటే టీడీపీ ప్రభుత్వం వాటిని చూపించడానికి ఎందుకు జంకుతోందని బీజేపీ వారు అంటుంటే, అసలు యుసిల సమాచారం ఆ పార్టీకి చూపించాల్సిన అవసరం లేదని టీపీడీ వారు అంటున్నారు. కాగా అసలు కేంద్ర నిధుల విషయమై ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొందరు సీనియర్లు, మరియు నిపుణులతో కలిసి జేఎఫ్సి పేరిట ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు.

కొన్నాళ్ల సుదీర్ఘ చర్చలు మరియు విశ్లేషించిన సమాచారం అనంతరం కేంద్ర మరియు రాష్ట్ర నిధుల లెక్కల విషయంలో కొంత తేడా ఉందని, బీజేపీ వారు చెపుతున్నట్లు టీడీపీ నేతలు నిధుల విషయంలో కొంత అవకతవకలు జరిగినట్లు చెప్పారు. ఇక అప్పటినుండి చంద్రబాబుపై మాటల యుద్దాన్ని ప్రకటించిన పవన్, తాను అసలు ఇదివరకు ఎన్నికలప్పుడు పోటీ చేసి వుండవలసిందని, అయితే కార్యకర్తల బలం లేకపోవడం వల్లనే పోటీ చేశామని, అందుకే ఆ సమయంలో టీడీపీకి మద్దతిచ్చామని అన్నారు. మొత్తంగా చూస్తే అటు కేంద్ర వాదనలు, ఇటు అధికార పక్ష వాదనల విషయమై రాజకీయ నిపుణులు మాత్రం మిశ్రమ స్పందనను వ్యక్తపరుస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఇక ఆ రెండిట్లో ఏపార్టీ రానున్న ఎన్నికలలో ఏ మేరకు విజయం సాధిస్తుందో రానున్న ఎన్నికలవరకు వేచి చూస్తే త్లెలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments