అధికారం కావాలి – పదవి కావాలి

Monday, October 13th, 2014, 01:36:28 PM IST

amit-shah-and-kishan-reddy
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రానున్న రోజుల్లో తెలంగాణలో సైతం అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ పోటీ భారీగా పెరుగుతోంది. అధ్యక్ష పీఠాన్ని అందిపుచ్చుకునేందుకు… పార్టీ జాతీయస్థాయి నేతలతోపాటు.. రాష్ట్ర నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో పునాది కావాలని పార్టీ పెద్దలు ఆశపడుతున్నారు. ఈనేపథ్యంలోనే జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి పెట్టారు. దీంతో పార్టీ పెద్దల ఆలోచనలకు అనుగుణాంగా తెలంగాణలో నేతల్లో కదలిక మొదలైంది.

ఈ దీమానే పార్టీ నేతల మధ్య అధికార పోరుకు దారితీస్తోంది. పదవి అందిపుచ్చుకునేందుకు ఇప్పటినుండే పావులు కదుపుతున్నారు. రాష్ట్ట్రంలో చక్రం తిప్పాలంటే ముందుగా పార్టీ అధ్యక్షుడి పదవిని పోందే అలోచనలో పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా రాష్ట్ట్ర స్థాయినుండి జాతీయ స్థాయిలోకి వెళ్లిన జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్ రావు ప్రధానంగా అధ్యక్ష పదవిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈయనతోపాటు పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ డా..లక్ష్మణ్, జాతియ కార్యవర్గ సభ్యుడు రాంచందర్ రావు సహా… రీసెంట్ గా పార్టీలో చేరిన నాగం జనార్థన్ రెడ్డి సైతం పార్టీ పదవిపై ఆశలు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే పార్టీ పదవి మారేందుకు మరో ఏడాది కాలం ఉన్నా.. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి… నేతలు ఆశించిన స్థాయిలో పార్టీని ముందుకు తీసుకులేకపోతున్నారనే అభిప్రాయంతో ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఆయనపై జాతీయ నాయకత్వానికి పిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో హైకమాండ్ నేతలు భావిస్తున్నట్టుగా.. పార్టీ బలం పంజుకోకపోతే మధ్యలోనే పార్టీ పదవులను మార్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే అధ్యక్షపదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు పార్టీ కార్యక్రమాలతోపాటు వ్యక్తిగత కార్యక్రమాలకు ప్రయారిటి ఇస్తున్నారు. ప్రధానంగా పార్టీ హైకమాండ్ అండదండలు ఉన్న మురళిధర్ రావు… తన వర్గాన్ని రూపోందించే పనిలో పడ్డారు. పార్టీలోని అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు పలు కార్యక్రమాలను ఆయన స్వతహాగా నిర్వహిస్తున్నారు. గతంలో వివిధ పార్టీ విభాగాల్లో పనిచేయడంతోపాటు.. కేంద్రంలో సహకారం ఉండడంతో ఆయనకు… పదవిని చేపట్టే అవకాశం ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.

మొత్తం తెలంగాణలో బీజేపీ పాగ వేసేందుకు పూర్తి స్థాయిలో నేతలు తమవంతు ప్రయత్నం చేస్తున్నా.. పార్టీలో వర్గపోరుకు ఇప్పటి నుంచే తెరలేస్తోంది. దీంతో పార్టీ పరంగా కలిసి పనిచేయాల్సిన నేతలు.. తలోదారి పట్టడడం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. మరోవైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అనుచరుడిగా ముద్రపడ్డ కిషన్ రెడ్డిని.. మధ్యలోనే కదిలించే శక్తి ఉంటుందా అనేది చూడాలి..