కర్ణాటక లో బిజెపి విజయం ఖాయం – సోము వీర్రాజు

Sunday, May 6th, 2018, 11:30:27 PM IST

ఇంకొద్దిరోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రచార హోరు ఊపు అందుకుంది. కాంగ్రెస్, బిజెపి, జనతాదళ్ తదితర పార్టీలన్నీ తమ మానిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే అక్కడ అధికారంలో వున్నముఖ్యమంత్రి సిద్దరామాయ్యా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మళ్ళి అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు తెలుగు వారు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో మెగాస్టార్ చిరంజీవి వంటి వారిని ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్న ఆ పార్టీ, ఇప్పటికే బెంగుళూరు వేదికగా యుపిఎ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పిలిచి ఒక భహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఆ సభ పార్టీ నేతల్లో నూతనోత్సాహం నింపిందని, మళ్లి ఇక్కడ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బిజెపి కూడా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళుతోంది. రాజధాని నగరమైన బెంగుళూరు ను మరింత సుందరీకరిస్తామని, ఇక్కడి ప్రజల అభిష్టాల మేరకు నడుచుకుంటామని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించిందని ఆయన విమర్శించారు.

అలానే ముఖ్యకమంత్రి సిద్దరామయ్య అవినీతి కింగ్ గా తయారయ్యారని అన్నారు. అయితే ఈ విషయమై నేడు ఏపీ బిజెపి నేత సోము వీర్రాజు మాట్లాడుతూ కర్ణాటక లో బిజెపి గెలుపు ఖాయమని, అక్కడి ప్రజలు తమగెలుపుని ఎప్పుడో నిర్ణయించారని అన్నారు. మోడీ పాలనలో దేశం ఇప్పటికే సుభిక్షంగా ఉందని, అలంటి నేత పాలన మా రాష్ట్రంలో కూడా కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని నీచ రాజకీయాలు చేసినా ఈసారి ప్రజలు తమకే పట్టంకడతారని, తమకు కూడా గట్టి నమ్మకముందన్నారు. ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపి ఫై కావాలనే బురద జల్లుతున్నారని, ఇక్కడ బిజెపిని అణిచివేయాలని టీడీపీ కుట్రపన్నుతోందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు……

Comments