ఎమ్మెల్యేలుగా యెడ్డీ.. సిద్దూ అనే మేము…

Saturday, May 19th, 2018, 12:27:58 PM IST

గత కొద్ది రోజులుగా ఎంతో రసవత్తరంగా సాగుతున్న కర్ణాటక ఎన్నికల సందడి ఈ రోజు చివరి అంకానికి చేరింది. ఈ ఉదయం 11 గంటలకు కర్ణాటక రాష్ట్ర శాసన సభ 3 పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశమైంది. సర్వ హక్కులు కలిగిన పోట్రేం స్పీకర్ గా బాపయ్య బాపయ్య భాద్యతలు చేపట్టారు. భాజాపా బలనిరూపణ పరీక్ష ధంకా మోగింది. ఉదయం శాసన సభ సాక్షిగా విశ్వాస పరీక్షకు ముందు కర్ణాటక ఎమ్మెల్యేలు యడ్యూరప్ప, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య పదవీ ప్రమాన స్వీకారం చేశారు. వారితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ఒక్క కర్ణాటక రాష్ట్రమే కాకుండా దేశమంతటా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బలనిరూపణ యుద్ధం మొదలయింది. ఎవరో సీఎం, కేంద్ర పార్టీ అయిన భాజాపా తన సత్తా చాతుతుందా, లేక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్స్, జేడీఎస్ ల పంతం నెగ్గుతుండా ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments