బ్లాక్ బెర్రీ న్యూ మొబైల్.. క్వెర్టీ ఫిజకల్‌ కీబోర్డు!

Monday, July 23rd, 2018, 04:32:50 PM IST

జియో ప్రభావం భారత టెక్నాలిజీలో చాలా మార్పులు తెచ్చిందనే చెప్పాలి. ఇంటర్నెట్ చార్జీలు చాలా వరకు తగ్గడంతో అందరూ జియో సిమ్ కోసమని స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేశారు. ప్రతి పదిమందిలో ఏడుగురి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడం గమనార్హం. ఇకపోతే అందరూ కూడా టచ్ స్క్రీన్ ఫోన్లు కొంటుండడంతో ఫిజకల్‌ కీబోర్డు ఫోన్లకు ప్రాధాన్యత తగ్గింది. కేవలం కొన్ని కంపెనీలు కొన్నిటిని మాత్రమే తయారుచేస్తున్నాయి. ఇకపోతే మొబైల్ రంగంలో అప్పట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లాక్ బెర్రీ స్టైలిష్ ఫిజకల్‌ కీబోర్డు గల ఫోన్లను తయారుచేసి రిలీజ్ చేసేది. అప్పుడు వాటికి ఉండే ఆదరణే వేరు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇప్పుడు బ్లాక్ బెర్రీ నుంచి సరికొత్త మొబైల్ వచ్చింది. క్వెర్టీ ఫిజకల్‌ కీబోర్డు తో పాటు టచ్ స్క్రీన్ ఉన్న బ్లాక్‌బెర్రీ కీ2 మోడల్ ను సోమవారం మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ధర రూ.42,990. ప్రస్తుతం ఈ ఫోన్ కు మంచి ఆదరణ లభిస్తోంది.

బ్లాక్‌బెర్రీ కీ2 ఫీచర్లు:

ఇంటర్నల్‌ మెమొరీ – 64/128 జీబీ
6జీబీ ర్యామ్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
బ్యాటరీ కెపాసిటీ 3500 ఎంఏహెచ్‌
12 మెగాపిక్సెల్‌ డ్యూయల్ కెమెరా
టచ్‌స్క్రీన్‌ 4.5 అంగుళాలు
8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా