అటువంటి వెబ్ సైటులను బ్లాక్ చేయండి : చంద్రబాబు

Thursday, May 10th, 2018, 03:43:58 PM IST

ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా అన్ని జిల్లాల ఎస్పీలతో శాంతిభద్రతల అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో అత్యాచారాలను అరికట్టాలని, ముఖ్యంగా యువకుల్లో లైంగిక ప్రవృత్తిని ప్రేపించే అశ్లీల వెబ్ సైట్ లను నిషేధించాలని ఆయన ఆదేశించారు. నేడు ప్రతిఒక్కరిదగ్గర సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటోందని, చాలామంది ఇంటర్నెట్ ధరలు తక్కువకావడంతో అస్లీల వెబ్ సైట్ లను ఓపెన్ చేసి చూస్తున్నారని, అవే మగవారిలో హింసాత్మక విధానాలను ప్రేరేపిస్తున్నాయన్నారు. వయో బేధంలేకుండా, తన పర, తేడాలు మరిచి ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు అత్యంత హేయమైనవిగా ఆయన అభివర్ణించారు. అలానే ఇటీవల దాచేపల్లిలో బాలిక పై జరిగిన అత్యాచారం వంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని ఎస్పీ లను గట్టిగా హెచ్చరించారు.

రాష్ట్రంలో మహిళల రక్షణ మన ప్రధమ కర్తవ్యమని, మున్ముందు మహిళలపై ఎటువంటి అకృత్యాలకు పాల్పడినా అటువంటి వారిని ఉపేక్షించేదిలేదన్నారు. అంతే కాదు అటువంటివారికి శిక్షలు మరింత కఠినంగా అమలుఅయ్యేలా చూస్తామన్నారు. అలానే అత్యాచార కేసులపై సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్, డిజిపి ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీ సమన్వయంతో ప్రజలమధ్యకు వెళితే మంచి ఫలితాలుంటాయని, శాంతిభద్రతల పరిస్థితి బాగుంటేనే ప్రజలు ఎల్లాప్ప్పుడు సంతోషంగా ఉంటారని అన్నారు. టెక్నాలజీని తప్పుడు మార్గాల్లో వినియోగించేవారిపై కఠినంగా వ్యవహరించాలి. మహిళలు, బాలికలు, ఎస్సీ ఎస్టీలపై నేరాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచి వేయాలి అని ఆదేశించారు……..

  •  
  •  
  •  
  •  

Comments