శుక్రవారమే బ్లడ్ మూన్.. భూమి అంతం?

Wednesday, July 25th, 2018, 07:27:20 PM IST

ప్రపంచంలో ఎన్ని వింతలు జరిగినా కూడా ఎదో ఒక రూమర్ మనిషి మనస్సును కదిలిస్తూనే ఉంటుంది. ఇక ఈ శుక్రవారం కూడా మనిషి బ్రతకడం అసాధ్యమని మానవుడి మనుగడకు అదే చివరి రోజనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బ్లడ్ మూన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఎప్పుడు కూల్ గా కనిపించే చంద్రుడు ఈ సారి ఎక్కువగా ఎరుపురంగులో కనిపిస్తాడు. ఈ నెల 27న చంద్రగ్రహణం కారణంగా చాలా మంది వివిధ రకాల రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు.

సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలోకి రావడం వల్ల సూర్యుడి కిరణాలు ప్రసరించి అతికొద్ది మొత్తంలో చంద్రుడిని చేరడంతో చంద్రుడు ఎరుపురంగులోకి మారుతుంటాడు. అదే సమయంలో అంగారక గ్రహం కనిపిస్తుంది. 2003లో చివరిసారిగా అంగారక గ్రహం ఆకాశంలో కనిపించింది. ఇక ఇప్పుడు 21వ శతాబ్దంలోనే అతి పొడవైన చంద్రగ్రహణం బ్లడ్ మూన్ ఎలా ఉంటుందో చూడాలని కొంత మంది ఎదురుచూస్తుంటే.. మరికొంత మంది ఇది అరిష్టమని మానవాళికి అంతం అని పూర్వికులు చెప్పేవారని ఆందోళన చెందుతున్నారు.