కలలో కనిపించిన స్వామిజీ చెప్పాడని అతను ఏం చేస్తున్నాడో తెలుసా..?

Thursday, December 29th, 2016, 08:00:09 PM IST

blue-home
ఆ దంపతులకు పెళ్ళై అయిదు సంవత్సరాలు అయ్యింది. ఇద్దరికీ నెలకు ఐదు లక్షల వరకు సంపాదన వస్తుంది. ఇంకేంటి జీవితం అంతా సంతోషంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఒకరోజు వచ్చిన అతనికి కల వాళ్ళ జీవితాన్ని ఎవరూ ఊహించని మలుపు తిప్పింది. ఆ కలలో స్వామీజీ చెప్పాడని అతను వింత వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇదంతా భరించలేని ఆమె అతనితో తనకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళింది.

అసలేం జరిగిందంటే.. బెంగుళూరు లో నివాసముంటున్న నితిన్ విశాల్ సింగ్ (35), నవీన (30) లకు ఐదు సంవత్సరాల క్రిందట వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగమే కావడంతో సంపాదనకు కూడా లోటు లేదు. డీఎస్ఆర్ లేఔట్ లో స్వంతంగా ఒక ప్లాట్ కూడా కొనుక్కున్నారు. కొద్దికాలం కిందట సింగ్ కు ఒక స్వామీజీ కలలో కనిపించి ‘బ్లూ’ జీవితాన్ని ప్రారంభించాలని సూచించడంతో ఆటను అప్పటినుండి ‘బ్లూ’ కలర్ ను ఇష్టపడడం ప్రారంభించాడు. అతని ఇల్లు, బట్టలు, వాహనాలు అన్నీ బ్లూ కలర్ లోకి మార్చేశాడు. అంతేకాకుండా భార్యను కూడా తనలాగే ఉండమని ఆర్డర్ వేశాడు. భార్యను కూడా సాధారణ బట్టలు కాకుండా బ్లూ కలర్ బట్టలే వేసుకోవాలని ఆదేశించాడని చెప్పారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేస్తాడని, భార్యను అలాగే తనతో పటు లేచి మెడిటేషన్ చేయమంటాడని చెప్పారు. తన భర్త వింత చేష్టలకు ఆశ్చర్యపోయిన నవీన తనకు విడాకులు ఇవ్వాలని కోరింది. అయితే అతను అందుకు నిరాకరించాడు. తన భార్య తనకు అదృష్ట దేవత అంటున్నాడు. అతను విడాకులకు ఒప్పుకోకపోవడంతో ఈ కేసును కోర్టుకు పంపే ఆలోచనలో ఉన్నారు పోలీసులు.

  •  
  •  
  •  
  •  

Comments