కన్నీరు పెడుతూ అనుచరుడి పాడె మోసిన కోమటిరెడ్డి !

Friday, January 26th, 2018, 11:40:16 AM IST


కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి అనుచరుడు బొడ్డు పల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ మరణ వార్త వినగానే కోమటిరెడ్డి దిగ్బ్రాంతికి గురయ్యారు. కాగా ఆయన శ్రీనివాస్ అంత్య క్రియల్లో పాల్గొన్నారు. కోమటిరెడ్డికి ఓదార్చడం ఎవరితరం కాలేదు. తీవ్రమైన దుఖం తో ఆయన అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. కోమటిరెడ్డి అనుచరులు ఆయనకు సపర్యలు చేశారు.

అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్న కోమటి రెడ్డి కన్నీరుపెడుతూనే శ్రీనివాస్ పాడె మోశారు. ఒకరోజు ముందు తన పక్కనే ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్లే సరికి హత్యకు గురి కావడంతో కోమటి రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. శ్రీనివాస్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రాధమిక దర్యాప్తులో పోలీస్ లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదో గొడవ జరుగుతోందని తెలుసుకున్న శ్రీనివాస్ అక్కడికి వెళ్లగా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.