ఈ ఒక్క నేత మాత్రమే కేసిఆర్ మాట వినట్లేదు !

Thursday, November 1st, 2018, 12:29:29 PM IST

107 మంది అభ్యర్థులతో కేసీఆర్ తొలిదశ జాబితాను ప్రకటించగానే చాలా మంది అసంతృప్తులు పుట్టుకొచ్చారు. నల్లాల ఓదెలు లాంటి తాజా మాజీలు తమకు టికెట్ ఇవ్వకపోతే అంతే అని పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేశారు. కానీ కేసిఆర్ బెదరలేదు. చివరికి కడియం శ్రీహరి లాంటి ప్రధాన నేత అలకబూనినా ఆయన దిగిరాలేదు. నయానో, భయానో అందరినీ కంట్రోల్ చేశారు. మాట వినని అసమ్మతి నేతలు వేనేపల్లి వెంకటేశ్వరరావు, రాములు నాయక్ వంటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కాగా అధినేత పద్దతి నచ్చని కొండా సురేఖ, మోహన్ బాబు లాంటి వాళ్ళు పార్టీ వదిలి బయటికెళ్లిపోయారు.

ఇలా చాలా మంది అసంతృప్తుల సమస్యలు ఏదో విధంగా కొలిక్కిరాగా చొప్పదండి నియోజకవర్గపు తాజా మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ మాత్రం తగ్గడం లేదు. 18 సంవత్సరాలు పార్టీకి పనిచేయసం ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్న ఆమె 119 స్థానాల్లో 107 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అందులో మహిళకు ఒక్క సీటు కూడ లేదని, తాను దళితురాలిని అయినందువలనే ఈ వివక్ష చూపుతున్నారని, ఇంతవరకు వచ్చాక ఈ వెనక్కి తగ్గేదే లేదని అన్నారు.

తన మద్దతుదారుల్ని, కొంతమంది నాయకుల్ని కూడగట్టుకుని పగలు, రాత్రి అని తేడా లేకుండా నియోజవర్గంలో మీటింగులు పెడుతూ తనకు కాకుండా తనపై కుట్ర చేసిన నాయకులకు టికెట్ ఇస్తే సహించేది లేదని, స్వతంత్ర్యంగా అయినా పోటీ చేస్తానని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. కానీ 60 రోజుల నుండి ఆదోళన చేస్తున్న ఆమె విషయంలో అధిష్టానం ఇప్పటికీ స్పందించకపోవడం, ఆమెను పిలిచి చర్చలు జరపకపోవడం గమనార్హం.

  •  
  •  
  •  
  •  

Comments