అవును నేను ఆమెను రేప్ చేసి ఉండ‌వ‌చ్చు.. ప్ర‌ముఖ న‌టుటు సంచ‌ల‌నం..!

Wednesday, October 10th, 2018, 01:15:37 PM IST

బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ప్ర‌కంప‌న‌లు రోజురోజుకీ తీవ్ర‌స్థాయిలో ర‌చ్చ చేస్తున్నాయి. తొలుత త‌నుశ్రీద‌త్తా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న లైంగిక వేధింపుల పై గ‌ళ‌మెత్త‌గా.. ఇప్పుడు వ‌రుస‌గా చాలామంది న‌టీమణులు బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ‌కు ఎదురైన వేధింపుల‌ను ఒక్కొక్క‌టిగా బ‌య‌ట పెడుతున్నారు. ఈ నేప‌ధ్యంలో తాజాగా ప్ర‌ముఖ ర‌చ‌యిత, నిర్మాత అయితే వినితా నందా త‌న‌కు బాలీవుడ్ ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు అలోక్‌నాథ్ మధ్యం తాగించి మ‌రీ రేప్ చేశాడ‌ని చెప్పి ఒక్క‌సారిగా సంచ‌ల‌నం రేపింది.

దీంతో ఈ వివాధం పై తాజాగా సీనియ‌ర్ న‌టుడు అలోక్ నాథ్ స్పందిచారు. వినితా నందా- తాను ఒక‌ప్పుడు మంచి స్నేహితుల‌మ‌ని.. ఆ రోజుల్లో తామిద్ద‌రం త‌ర‌చూ క‌లుసుకునేవాళ్ల‌మ‌ని.. అయితే ఆమె చెప్పిన ప్ర‌కారం చూస్తే.. 20 ఏళ్ళ క్రితం ఆ ఘ‌ట‌న జ‌రిగిందని.. అయితే అప్పుడు వినితా నందా పై జ‌రిగి ఉండొచ్చు.. కానీ ఆ రేప్ త‌న చేశానో లేక ఇంకొక‌రు చేశారో తెలియ‌దని.. ఆమె పై రేప్ అయితే జ‌రిగి ఉండొచ్చు అని అలోక్ నాథ్ కామెంట్స్ చేయ‌డంతో.. ఇప్పుడీ వ్యవ‌హారం బాలీవుడ్ సినీ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత దూరం వెళుతుందో చూడాలి.