సంజయ్ దత్ కు సెలవు వివాదం

Friday, December 26th, 2014, 11:20:25 PM IST

sanjai-dath
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలు నుంచి సెలవు పొందడం మహారాష్ట్రలో వివాదంగా మారింది. సంజయ్ దత్ సెలవుపై విచారణ జరుపాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సరైన కారణాలను పరిగణనలోకి తీసుకుని కోర్టు సంజయ్‌దత్‌కు సెలవు మంజూరు చేసిందా అనే అంశంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఎరవాడ జైలు శిక్షననుభవిస్తున్న సంజయ్‌దత్‌కు కోర్టు మూడు రోజుల క్రితం 14 రోజుల సెలవును మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. 14 రోజుల అనంతరం సంజయ్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.