ప్రాణాపాయం నుండి బయటపడ్డ బాలీవుడ్ భామ… హేమామాలిని

Monday, May 14th, 2018, 11:07:16 AM IST

సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ అందాల తార, బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, బీజేపీ ఎంపీ హేమామాలిని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయట పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో పర్యటనాలో పాల్గొన్న సమయంలో ఓ భారీ చెట్టు ఆమె కాన్వాయ్ ముందు ఉన్నట్టుండి కూలింది. మధుర దగ్గర్లోని మిథౌలి గ్రామంలో ఓ మీటింగ్‌లో పాల్గొనడానికి హేమమాలిని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దేశవ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా 40 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూపీ, ఢిల్లీ ప్రాంతాలు ఈదురుగాలులు, భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి వర్షాలు, ఈదురు గాలులు సంభవంచి దేశాన్ని అయోమయంలో పట్టేశాయి. ఇదే సమయంలో సమావేశం కోసం మధుర వెళ్లారు హేమామాలిని. ఆమె కాన్వాయ్ వెళ్తుండగానే సడెన్‌గా పెద్ద చెట్టు రోడ్డుపై కూలింది. దీంతో వెంటనే కాన్వాయ్‌ను ఆపేశారు. స్థానికుల సమాచారం ప్రకారం హేమ మాలినికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆమె ప్రాణాపాయం నుండి బయట పడి జాగ్రత్తగా ఇల్లు చేరుకున్నారని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments