అమ్మా నాన్న చనిపోయిన నాలుగేళ్లకు పుట్టాడు

Sunday, April 15th, 2018, 10:57:18 AM IST

మీరు విన్నది నిజమే. జన్మనిచ్చే తల్లిదండ్రులు ముందే చనిపోయారు. కానీ కుమారుడు మాత్రం నాలుగేళ్ల తరువాత పుట్టాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వార్త ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. ఆ విషయం ఏమిటో మనం కూడా తెలుసుకుందాం పదండి. చైనాకు చెందిన చెందిన షెన్‌ జీ, ల్యూషి భార్య భర్తలు. అయితే వాళ్లు ఎప్పటి నుంచో కృత్రిమ గర్భధారణతో పిల్లల్ని కావాలని అనుకుంటున్నారు. అందుకోసం సరోగసీ బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు.

కుటుంబ సభ్యుల నిర్ణయంతో ఎంతో ఆనందంగా అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో బిజీ అయ్యారు. అయితే వారి కల నెరవేరకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారు. 2013లో జరిగిన కారు ప్రమాదంలో ఎవరు ఊహించని విధంగా వారు మృత్యువాత పడటం అందరిని మనోవేదనను కలుగజేసింది. అయితే వారి కోరిక కూడా చనిపోకుడదని షెన్‌ జీ ల్యూషి తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. అయితే చనిపోయిన దంపతులు ముందే కణాలను ఫలదీకరణం చేసి గర్భస్థ పిండాన్ని వైద్యుల సంరక్షణలో ఉంచారు.

షెన్‌ జీ ల్యూషి తల్లిదండ్రుల ప్రయత్నానికి అక్కడి చట్టాలు అడ్డుపడ్డాయి. దీంతో మరో దేశమైన లూయిస్ వెళ్లి అక్కడ మరో మహిళా ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. అయినా కూడా వారికి చట్టపరమైన ఇబ్బందులు తప్పడం లేదు. కుటుంబ సభ్యుల డీఎన్ఏ తో మ్యాచ్ అయితేనే చైనాలో ఆ బిడ్డ ఉండడానికి అర్హులను అక్కడి న్యాయవ్యవస్థలో రూల్.