మార్కెట్ కుదేల్.. ధిమ్మ తిరిగే షాక్!

Wednesday, February 7th, 2018, 04:31:52 PM IST

షేర్ మార్కెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కొంత మంది నిపుణులకు అవగాహనా చాలా ఉంటుంది. గత కొంత కాలంగా భారత మార్కెట్ విలువ చాలా వరకు పెరుగుతూ వస్తోంది ఇన్వెస్ట్ మెంట్ చేయడంలో కొంచెం ఐడియా ఉంటే చాలా చాలా మంది ఇన్వెస్ట్ మెంట్ దారులు లాభాలను ఆర్జిస్తున్నారు. గత రెండు మూడు నెలలో కూడా గరిష్టంగా లాభాలను అందించిన మార్కెట్ విలువలు రోజు రోజుకు పెరిగాయి. కానీ గత వారం నుంచి ఎవరు ఊహించని విధంగా మార్కెట్ కుదేలైంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

షేర్స్ విలువ అమ్మాలన్నా కొనాలన్నా ఊహించని పరిణామాలు ఎదురవుతుండడం మదుపరులను సందిగ్ధంలో పడేశాయి. కేవలం ఆరు రోజుల్లోనే రూ.10 లక్షల కోట్ల్లు ఆవిరి అయ్యాయి అంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ముచ్చెమటలు పట్టిస్తున్న మార్కెట్ ఒక్కసారిగా 1,275 పాయింట్ల పతనాన్ని చూడగా చివరలో కొంచెంగా 700 పాయింట్లతో రికవర్ అయ్యింది. సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కూడా కీలక మద్దతు కోల్పోవడం అనూహ్య పరిణామమని చెబుతున్నారు.ఈ పరిస్థితి చూస్తుంటే మార్కెట్ విలువ ఎక్కడికిపోతోంది అనే విషయం ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లు సైతం నష్టాలను బాగానే చూశాయి.

అయితే బుధవారం సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగానే కదలాడి బెటర్ అనిపించింది. ఉదయం 1004 పాయింట్ల నష్టంతో 33,753.78 పాయింట్లతో వద్ద బలహీనంగా స్టార్ట్ అయ్యింది. అనంతరం కొంచెం పెరిగినప్పటికీ వెంటనే సెన్సెక్స్‌ 34,000 పాయింట్ల వద్దకు దిగజారింది. మార్కెట్ లో షేర్లకు అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సూచీలు మొత్తంగా డౌన్ అయ్యాయి. సెన్సెక్స్‌ కొంత సమయంలో 33482.81 పాయింట్ల కనిష్ఠానికి వచ్చింది. దీంతో 1275 పాయింట్లతో సూచి నష్టంలో కనిపించింది. మధ్యాహ్న సమయానికి చాలా వరకు షేర్లు కనిష్ట స్థాయికి చేరడంతో కొనుగోళ్ల మద్దతు అందుకుంది. కొంచెం నష్టపోకుండా ఉన్నప్పటికీ సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో మొత్తంగా 34521.01 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని అందుకోగా జనవరి 5 తర్వాత సెన్సెక్స్‌కు కనిష్ఠ స్థాయికి వచ్చింది. అప్పుడు 236 పాయింట్లతో సూచీ నష్టాల్లో ఉంది. ఆ తరువాత కొంత నష్టంతో 34,195.94 పాయింట్ల దగ్గర ఆగింది. సెన్సెక్స్‌ మొత్తంగా 30 షేర్లలో 29 నష్టాలు చూడగా టాటా స్టీల్ మాత్రమే లాభపడింది.

డీలాపడ్డ కంపెనీలు

టాటా మోటార్స్‌ 5.45%,
టీసీఎస్‌ 3.58%,
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 2.70%,
ఇన్ఫోసిస్‌ 2.62%,
హీరో మోటోకార్ప్‌ 2.52%,
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.31%,
హిందుస్థాన్‌ యునిలీవర్‌ 2.22%,
ఎస్‌బీఐ 2.08%,
ఏషియన్‌ పెయింట్స్‌ 2.07%,
హెచ్‌డీఎఫ్‌సీ 2.03%,
ఐటీసీ 1.99%,
ఓఎన్‌జీసీ 1.69%,
యెస్‌ బ్యాంక్‌ 1.61%,
కోల్‌ ఇండియా 1.49%,
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.29%