చంద్రబాబుకి వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టిన విద్య..!

Sunday, September 16th, 2018, 11:46:35 PM IST

ఈ రోజు విజయవాడలో జరిగిన ఒక మీటింగులో వైసీపీ నేత బొత్స సత్యన్నారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన విమర్శలు చేశారు. మోసం,దగా,మాయ ఇవన్నీ చంద్రబాబు యొక్క ఇంటి పేర్లు అని, ఆయన ఎవరికైనా వెన్నుపోటు పొడవడంలో ఎవరు సాటి రారు అని అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్టు విషయంలో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 82 శాతం పూర్తి చేస్తే గడిచిన నాలుగున్నర ఏళ్ళల్లో చంద్రబాబు కేవలం 12 శాతమే చేసారు అని తెలిపారు.

మొన్నటి వరకు ముందస్తు ఎన్నికల నిమిత్తం బాబు మాట్లాడినప్పుడు ఇప్పుడు అదే విషయాన్ని జగన్ మాట్లాడితే వారు ఎందుకని విమర్శిస్తున్నారని అడిగారు.వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి హాజరు కాని విషయంలో చంద్రబాబు మాటలకు గాను మీరు పాదయాత్ర చేసిన సమయంలో జీతాలు తీసుకోలేదా..? అని ప్రశ్నించారు.బాబ్లీ విషయంలో అన్ని సార్లు నోటీసులు వచ్చినా సరే వెళ్లకుండా చివరి నిమిషంలో తన రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారు అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments