అమ్మాయిలకు ఆ అలవాటు ఉంటే పెళ్లికి నో అంటున్న అబ్బాయిలు..!

Thursday, January 11th, 2018, 05:10:20 PM IST

యువతీ యువకుల ఆలోచనల్లో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వారి జీవిత భాగస్వామి విషయంలో ఈ కాలం యువత కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే వివాహ సంబంధాలని చూపించే మాట్రిమోనియల్ వెబ్ సైట్లు యువత ఆలోచనలకూ అనుగుణంగా మార్పులు చేస్తున్నాయి. వారు కోరిన లక్షణాలని తమ వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నాయి. ఇటీవల జరిపిన సర్వే ప్రకారం అబ్బాయిలంతా కామన్ గా ఓ కోరిక కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ నెట్, పేస్ బుక్ మరియు వాట్సాప్ వంటి సామజిక మాధ్యమాలకు బానిసగా మారిన అమ్మాయిలు తమకు వద్దని ఆ వెబ్ సైట్ లలో ప్రకటనలు ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఎక్కువైనట్లు తెలుస్తోంది.

నిపుణులు దీనికి కారణాలని వివరిస్తున్నారు. అమ్మాయిలకు ఇంటర్ నెట్ మరియు సామజిక మాధ్యమాలలో ఎక్కువగా గడుపుతుంటే వారి దాంపత్య జీవితంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇండియా మొత్తం మాట్రిమోనియల్ సంస్థల్లో దీనికి సంబందించిన ప్రకటనలు ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ కి చెందిన యువకులైతే మాట్రిమోనియల్ సంస్థలకు ఈ విషయాన్ని గుచ్చి గుచ్చి చెబుతున్నారట.