బ్రేకింగ్ న్యూస్ : ఆనం వివేకానందరెడ్డి మృతి

Wednesday, April 25th, 2018, 10:10:52 AM IST

నెల్లూరు జిల్లా ప్రముఖ టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి (67) నేడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతిచెందారు. గత కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రం కావడం, దానివల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో రేడియేషన్ చికిత్స కోసం కొద్దిరోజుల క్రితం ఆయన్ని హైదరాబాద్ తీసుకువచ్చారు. కాగా మూడు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని ఆసుపత్రిలో పరామర్శించారు.

ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో సోదరుడు ఆనం రామ్ నారాయణరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో వున్న ఆయన నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత వివేకానంద రెడ్డి. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంతరి వైఎస్సాఆర్ మరణం తర్వాత ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. విలక్షణమైన వ్యక్తిత్వం, మంచి వాక్చాతుర్యం, వేషధారణ కలిగిన వ్యక్తి వివేకానంద రెడ్డి. ఆయన ఏ విషయమైన స్పందించవలసి వస్తే నిర్మొహమాటంగా చెపుతారు తప్ప ఏది లోపల దాచుకోరని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయన1950 డిసెంబర్ 25న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు వున్నారు. ఆయన మృతికి పలువురు రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేశారు…..