బ్రేకింగ్ న్యూస్ : ఇన్సూరెన్స్ సొమ్ము కోసం శ్రీదేవిని చంపారా?

Wednesday, May 23rd, 2018, 10:08:50 AM IST

దివంగత నటి శ్రీదేవి మరణంపై వున్న అనుమానాలు ఇప్పటికీ కూడా తొలగడంలేదు. ఆమె ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లి, అక్కడ తన హోటల్ గది లోని బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమెది సాధారణ మరణం కాదని, ఆమెను ఎవరో కావాలని హత్య చేసారని రకరకాలుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా ప్రస్తుతం ఆమెను ఇన్సూరెన్సు డబ్బుకోసం హత్య చేశారనే ఒక వార్త సంచలనం రేపుతోంది. శ్రీదేవి మరణంపై ఎటువంటి అనుమానాలు అవసరంలేదని అప్పట్లో సుప్రీమ్ కోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అయితే ప్రస్తుతం సునీల్ సింగ్ అనే ఒక సినీ నిర్మాత మళ్లి సుప్రీమ్ కోర్టులో ఆమె మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్ లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయని సమాచారం.

కాగా సునీల్ సింగ్ పిటీషన్ ప్రకారం శ్రీదేవి పేరుతో రూ.240 కోట్లకు ఇన్సూరెన్సు పాలసీ ఒకటి ఒమన్ లో తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి అంత పెద్ద మొత్తంలో అసలు ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయా అని కొందరు సందేహపడుతున్నారు. అయితే ఆ పాలసీ ప్రకారం ఆమె దుబాయిలో మృతి చెందితేనే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సొమ్ము తమ వారసులకు చెందుతుంది. అక్కడి పాలసీలు అలానే ఉంటాయట. నిజానికి దుబాయ్ ని చాలామంది మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అడ్డా గా చెపుతుంటారు. మరొక విషయం ఏమిటంటే శ్రీదేవి బస చేసిన జమైరా టవర్స్ దావూద్ ఇబ్రహీందెనట.

అలానే మొన్నామధ్య ఆమె మరణం పై కొన్ని అనుమానాలున్నట్లు వేద భూషణ్ అనే మాజీ పోలీస్ అధికారి ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. వేద భూషణ్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ని కూడా నడుపుతున్నారు. ఆయన మాట్లాడుతూ శ్రీదేవి మరణం వెనుక వున్న రహస్యాన్ని ఛేదించడానికి తాను దుబాయ్ వెళ్లి జమైరా టవర్స్ హోటల్ లో శ్రీదేవికి ఇచ్చిన రూమ్ ఇమ్మని అడిగానని, అయితే హోటల్ సిబ్బంది నిరాకరించడంతో పక్కనే వున్న వేరొక రూమ్ ను తీసుకుని అసలు ఆమె మృతిపై కల్పిత పాత్రలతో ఒక ప్రయోగం చేసి చూశానన్నారు. ముమ్మాటికీ శ్రీదేవి బాత్ టబ్ లో పడి చనిపోలేదని, ఎవరో సినిమాల్లో చూపినట్లుగా ఆమెను టబ్ లో ముంచి ఊపిరాడకుండా చేసినట్లు అనుమానానం వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు ఆమె మరణంపై దావూద్ ప్రభావం కూడా వుంది ఉండొచ్చు అనేది ఆయన భావన. మొత్తానికి శ్రీదేవి మరణానికి సంబంధించి మళ్ళి అనుమానాలు మొదలవడంతో అసలు ఆమెది హత్య, లేక ప్రమాడువసాత్తు మరణించారా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు…..

  •  
  •  
  •  
  •  

Comments