బ్రేకింగ్ న్యూస్ : జియో ఫైబర్ నెట్…..నెలకు 1.1 టెరాబైట్ ఫ్రీ ఇంటర్నెట్

Sunday, May 6th, 2018, 10:24:02 PM IST


రిలయన్స్ సంస్థవారి జియో రాకతో ఒక్కసారిగా ఇంటర్నెట్ ధరలు పడిపోవడం తద్వారా ఇంటర్నెట్ సేవలు సగటు వినియోగదారుడికి అత్యంత తక్కువధరకు అందుబాటులోకి రావడం తెలిసిందే. ఆ తరువాత మిగతా టెలికాం కంపెనీలు కూడా జియో దెబ్బకి ధరలు తగ్గించి దిగిరావలసి వచ్చింది. అయితే ప్రస్తుతం జియో సంస్థ ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందించే విషయమై కొద్దికాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించాలనే తపనతో ఈ ప్లాన్ ను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు. ‘ఫైబర్ టు థ హోమ్’ పేరుతో ప్రవేశపెట్టబడే ఈ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ప్రకారం తొలుత ప్రతిఒక్కరికి ఏకంగా 1.1 టెరాబైట్ ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం అందించనుంది. అయితే ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ సౌకర్యం ఉంటుందని తెలుస్తోంది.

అయితే జియో ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే వారు ముందుగా రూ.4500 సెక్యూరిటీ డిపాజిట్ క్రింద చెల్లించాలని, అయితే ఇది కనెక్షన్ తొలగించే సమయంలో తిరిగి ఇవ్వబడుతుందట. కాగా ఇప్పటికే ఈ సేవలను అందించేందుకు ఇండియాలోని న్యూ ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, జాం నగర్, ముంబై లతో పాటు మరికొన్ని పట్టణాలను పరీక్షించినట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ సేవలు మనకు జులై తర్వాత అందుబాటులోకి రానునున్నట్లు నిపుణులు చెపుతున్నారు. అంతే కాక ఈ రకమైన సేవల ప్రారంభం తర్వాత బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ లో వినియోగదారులకు ఉపయోగపడే విప్లవాత్మక మార్పులు వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు……