ట్రిపుల్ తలాక్ చెబితే ఇక అంతే.. నయా ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదం!

Thursday, September 20th, 2018, 02:36:55 PM IST

భారతదేశ న్యాయ వ్యవస్థలో గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా మారిన న్యూస్ ట్రిపుల్ తలాక్. భార్య అనుమతి లేకుండా వరుసగా మూడు సార్లు ట్రిపుల్ తలాక్ చెప్పి ఆ స్త్రీని వదిలెయ్యడం నిజంగా అన్యాయమని ఎంతో మంది నుంచి వ్యతిరేఖత వస్తోంది. ఇండియా కంటే అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం దేశాలు సైతం ట్రిపుల్ తలాక్ ని నిషేధించాయి. ఇందులో భారత్ కి దాయాది శత్రువైన పాకిస్థాన్ కూడా ఉంది. ఇక ఫైనల్ గా ఇండియాలో కూడా ట్రిపుల్ తలాక్ పై కేంద్రం కేబినెట్ త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇక గురువారం ఈ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసి ఆమోదం తెలిపారు. ఇక నుంచి ఎవరైనా ట్రిపుల్ తలాక్ చెబితే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అదే విధంగా నాన్ బెయిలబుల్ కేసుగా మారనుంది. ఇష్టానుసారంగా ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకునే వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చట్టాన్ని పొందుపరిచారు. భార్యలు కేసు నమోదు చేస్తే బెయిల్ కూడా రాదూ. కేవలం మెజిస్ట్రేట్ మాత్రమే బెయిల్ ఇచ్చేలా కఠిన నిబంధనలను పొందుపరిచారు. ఆ బెయిల్ కూడా భార్య వాదనను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది.