మారువేషంలో వచ్చి పిల్లలకు షాకిచ్చిన బ్రెట్ లీ

Monday, April 30th, 2018, 12:12:39 PM IST

ప్రస్తుతం ఎక్కడ చూసినా దేశంలో ఐపీఎల్ హంగామా కనిపిస్తోంది. యువత మొత్తం సాయంత్రానికి మ్యాచ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాకుండా సమ్మర్ కావడంతో సాయంత్రం పిల్లలు కూడా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ముంబై లోని ఓ గ్రౌండ్ లో చిన్నరులు క్రికెట్ ఆడుతుండగా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ మారువేషంలో వెళ్లాడు. తొలుత తనకు క్రికెట్ తెలియదు అంటూ తెలియనట్టే ఆడాడు ఆ తరువాత బ్రెట్ లీ తన అసలైన టాలెంట్ ను బయటకు తీశాడు. బ్యాటింగ్ లో బౌలింగ్ లో తన సత్తా చూపించడంతో చిన్నారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అడగడంతో వెంటనే బ్రెట్ లీ అసలు రుపాన్ని బయటపెట్టాడు. దీంతో అక్కడి చిన్నారులు ఎగిరిగంతేసి బ్రెట్ లీ తో ఆడినందుకు చాలా సంతోషించారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.