స్పీకర్ ఆర్డర్ చేస్తే బాక్స్ లో ఇటుక ప్రత్యక్షం !

Tuesday, January 9th, 2018, 01:09:22 PM IST

లాయర్ గా పని చేస్తున్న సెల్వకుమార్ చెన్నై లోని అన్ననగర్ , తూతుక్కుడి లోని ముల్ లైక్కాటు లో నివాసముంటున్నారు . ఆయన తాను కొత్తగా కొన్న కారులో స్పీకర్ కోసం జనవరి 1న ఒక ప్రముఖ ఆన్ లైన్ లో ఆర్డర్ బుక్ చేశారు , ఆదివారం మధ్యాహ్నం సదరు సంస్థ నుండివచ్చిన పార్సెల్ ని ఒక ప్రైవేట్ కొరియర్ సంస్థ బాయ్ ద్వారా అందుకున్న ఆయన స్పీకర్ ధర నిమిత్తం 5 వేలరూపాయలు అతనికి చెల్లించారు . తరువాత పార్సెల్ తెరిచి చూడగా అందులో ఇటుకరాయి వుంది , నిర్ఘాంతపోయిన ఆయన వెంటనే కొరియర్ సంస్థకు కాల్ చేయగా వారు సరైన సమాధానం ఇవ్వలేదు. వెనువెంటనే మల్లయ్ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కొరియర్ సంస్థ యజమానిని విచారణ చేశారు . తరువాత విషయం తెలుసుకున్న సదరు ఆన్ లైన్ కంపెనీ ఆయనకు నగదును వాపసు చేసింది. ఈ విధమైన ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని , ఆర్డర్ చేసిన వస్తువు చేతికి అందిన వెంటనే దానిని కొరియర్ బాయ్ సమక్షంలోనే విప్పి చూసుకోవాలని , దీనివలన మోసం జరిగే అవకాశం కొంత మేర తగ్గుతుందని పోలీసులు అంటున్నారు . కాబట్టి ఆన్ లైన్ లో ఏదైనా వస్తువు ఆర్డర్ చేస్తున్నారా, అయితే బి అలెర్ట్ ……