ఆ పెళ్ళికొడుకు బూట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Sunday, April 15th, 2018, 09:07:03 PM IST

బంగారం అంటే ఇష్టపడనివారు దాదాపుగా ఎవరు వుండరు అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా మన భారతీయులు తమకు ఎంత బంగారం ఉంటే అంత గొప్పగా ఫీల్ అవుతుంటారు. అంతే కాదు అప్పుడప్పుడు జరిగే ఫంక్షన్ లలో తమకు వున్న బంగారాన్ని ధరించడం ద్వారా మహిళలు గొప్పగా భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లో జరిగిన ఒక ఘటన వింటే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పాకిస్థాన్ కు చెందిన సల్మాన్ షాహిద్ అనే వ్యాపారవేత్త తన వివాహ రిసెప్షన్ లో ఏకంగా బంగారం, రత్నాలు, వజ్రాలతో తయారు చేయించిన సూట్, టై, అలానే బూట్లు ధరించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేసాడు. అతను ధరించిన సూట్ ఖరీదు 65,000 రూపాయలు (పాకిస్థాన్ కరెన్సీ ప్రకారం), అలానే 320 గ్రాముల బరువున్న బూట్ల ఖరీదు 17,00,000 (పాకిస్థాన్ కరెన్సీ ప్రకారం).

ఇలా మొత్తంగా చూస్తే అతని సూట్, టై, బూట్లు అంటే అతని అవుట్ఫిట్ మొత్తం ఖరీదు 25,00,000 (పాకిస్థాన్ కరెన్సీ ప్రకారం). ఈ ధర విన్న అక్కడికి వచ్చిన వారి బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పెళ్ళికొడుకు మాత్రం తనకు బంగారపు బూట్లు వేసుకోవాలని అని ఎప్పటినుండో ఉండేదని, అయినా మనం సృష్టించుకున్న డబ్బు, బంగారం అనేవి దుమ్ముతో సమానం అని చెప్పడమే తన ఉద్దేశం అని. అందుకే బంగారంతో బూట్లు చేయించి కాళ్లకు తొడుక్కున్నా అని అనడం కొసమెరుపు…..