లేటెస్ట్ న్యూస్ : అన్న ముఖ్యమంత్రి, కానీ చెల్లెలు మాత్రం టి అమ్ముతోంది!

Thursday, March 22nd, 2018, 12:58:26 PM IST

మనసుకు తెలిసిన దూరపు బంధువులెవరైనా మంచి హోదాలో ఉన్నారంటే చాలు తెలిసిన వాళ్ళందరూ చేసే హడావుడి అంత ఇంతా కాదు. అలాంటిది ఏకంగా దేశంలోని అతి పెద్ద రాష్ట్రానికి తన తోడపుట్టిన అన్న ముఖ్యమంత్రి అయినా సరే, ఆయన చెల్లి మాత్రం ఇప్పటికీ టీ అమ్ముతూ సాధారణ జీవనం సాగిస్తోంది. విషయంలోకి వెళితే ఇంతకీ ఆ అన్నాచెల్లెళ్లు ఎవరో కాదు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆయన చెల్లి శశిపాయల్‌. యోగి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాది గడిచిపోయింది, అయినప్పటికీ ఆయన కూడా ఎలాంటి హోదా, దర్పం లేకుండా చాలా సాధారణ జీవితం గడుపుతారని ఆయన సన్నిహితలు అంటుంటారు.

అలానే ఆయన ఎంపీ గా గతంలోనూ ఎంపీగా చాలా ఏళ్ల పాటు పనిచేశారు. కానీ ఇప్పటికీ ఆయన చెల్లెలు శశిపాయల్‌ మాత్రం గత 23 ఏళ్లుగా ఉత్తరాఖండ్‌లోని కోఠార్‌ గ్రామంలో చిన్న టీ కొట్టు నడుపుతూనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కేవలం ఆమె మాత్రమే కాదు ఆమె భర్త కూడా అక్కడే ఓ చిన్న పూజా సామగ్రి దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అన్న ముఖ్యమంత్రి అయినా దర్పం ప్రదర్శించకుండా అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న శశిపాయల్‌ను, ఆమె కుటుంబాన్ని చూసి గ్రామం లోని ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు…..