క్రికెట్ మ్యాచ్ మద్యలో బాంబు పేలుళ్లు… 8 మంది మృతి

Saturday, May 19th, 2018, 05:55:12 PM IST

రంజాన్ మాసం మొదలు కావడంతో ముస్లీం సోదరులలో సందడులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ లోని నాన్గర్ హార్ రాష్ట్ర రాజధాని అయిన కాబుల్ లోని జలాలాబాద్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం రాత్రి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. భారీ స్థాయిలో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంటును వీక్షించడానికి అభిమానులు కూడా చాలామంది తరలి వచ్చారు. చాలా ఉత్ఖంటతతో జరుగుతున్న ఈ క్రికెట్ మ్యాచ్లో అకస్మాత్తుగా బాంబు పేలుళ్లు మొదలయ్యాయి. ఎడతెరపి లేకుండా వరుసగా పేలిన 3 బాంబులను చూసి ప్రేక్షకులంతా చల్లా చదురయిపోయారు.

ఎవరు ఎక్కడ తలదాచుకున్నారో కూడా ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా బాంబు పేలుళ్ళ భీభత్సం సృష్టించడంతో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన 8 మంది క్రికెట్ ఆటగాల్లేనని అక్కడి వార్తా ప్రతినిధులు వెల్లడించారు. ఈ 8 మందే కాకుండా ఇంకా 45 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ప్రస్తుతానికి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నట్టుగా పోలీసు వర్గాలు సమాచారం అందించాయి. కానీ అక్కడి ప్రభుత్వం ఈ విషయంపై ఏమైనా చర్య తీసుకుంటే ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని కనీసం జరిగిన ఘటనను అధికారికంగా అయినా ప్రకటించడానికి ఆలోచిస్తున్నది. పేలుళ్లపై ఆ రాష్ట్ర గవర్నర్ ఖండిస్తూ మృతులకు సంతాపం తెలిపారు.

ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఈ సంఘటనపై స్పందిస్తూ ముస్లీంల పవిత్రతకు నాంది అయిన రంజాన్ మాసం మొదటిలోనే ఇలా జరగడం దారుణమని, ఇలాంటి బాంబు దాడులకు పాల్పడినవారు మానవత్వానికి పెద్ద శత్రువులు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి ప్రస్తుతం ప్రభుత్వం ఈ సంఘటనపై ఎలాంటి చర్య తీసుకుంటుందని వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments