భాగ్యనగరం నడిరోడ్డు మీద గొడ్డలితో దారుణ హత్య.!

Wednesday, September 26th, 2018, 02:01:36 PM IST


గడుస్తున్న రోజుల్లో పరువు హత్యలైతేనేం,ఇతర కారణాలు అయితేనేం తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా హత్యలు ఎక్కువయ్యిపోతున్నాయి. మానవుడు మానవత్వం అనే పదం మర్చిపోయి విచక్షణ లేకుండా విచ్చలవిడిగా దాడికి పాల్పడుతున్నాడు.మొన్ననే కులాంతర వివాహ నేపధ్యంలోనే రెండు దారుణమైన దాడులు నుంచి భాగ్యనగర వాసులు నెమ్మదిగా కోలుకుంటున్నారు అన్న సమయంలో హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో ఎవరో ఒక గుర్తు తెలీని దుండగుడు వేరే గుర్తు తెలీని వ్యక్తి మీద గొడ్డలితో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేసాడు.

హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో పిల్లర్ నెంబర్ 143 వద్ద ఉన్నటువంటి ఒక గుర్తు తెలీని వ్యక్తిని ఒక దుండగుడు సహా మరో ముగ్గురు వ్యక్తులు కలిసి అతి దారుణంగా హతమార్చారు.వారిలో ఒకరు అస్సలు ఆపకుండా గొడ్డలితో దాడి చెయ్యడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.ఆ దాడి జరుగుతున్న సమయంలో అతన్ని ఆపడానికి అక్కడి స్థానికులు ప్రయత్నించినా అతడు ఆపలేదు,అతన్ని చంపేసి పరారీ అవుతున్న సమయంలో అక్కడి ట్రాఫిక్ పోలీసులు ఆ దుండగులిని పట్టుకొని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు.