నేపాల్ లో ఘోర విమనప్రమాదం 50 మంది కాలి బూడిదయ్యారు.

Monday, March 12th, 2018, 05:16:02 PM IST

బస్సు ప్రమాదాలు రైలు ప్రమాదాలు జరగడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ విమాన ప్రమాదం జరగడం మాత్రం చాలా అరుదు. తాజాగా నేపాల్‌లో ఈ ఘోరం జ‌రిగింది. యూఎస్‌-బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఖాట్మాండు విమానాశ్ర‌యంలో కుప్ప కూలింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 50 మంది మ‌ర‌ణించి ఉంటార‌ని విమానాశ్రయ సిబ్బండు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఢాకా నుంచి వ‌స్తున్న విమానం.. ఖాట్మాండులోని త్రిభువ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న స‌మ‌యంలో అకస్మాత్తుగా ఈ ప్ర‌మాదం సంభవించింది. విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అక‌స్మాత్తుగా ర‌న్‌వేపై జారింది. దీంతో ఆ విమానంకు ఉన్నట్టుండి మంట‌లు అంటుకున్నాయి. ఆ త‌ర్వాత అదే వేగంలో ర‌న్‌వే ప‌క్క‌న ఉన్న ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో కూలింది. విమాన శిథిలాల కింద మృత‌దేహాలు ఉంటాయ‌ని అనుమానిస్తున్నారు. ప్ర‌మాదానికి గురైన విమానం 78 మంది ప్ర‌యాణికులను తీసుకెళ్ల‌గ‌ల‌దు. కానీ ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో సుమారు 71 మంది ఉంటార‌ని అధికారుల అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అగ్నిమాప‌క సిబ్బంది సంఘటనా స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ 17 మంది ప్ర‌యాణికుల‌ను హాస్ప‌ట‌ల్‌లో చేర్చించిన‌ట్లు టూరిజంశాఖ కార్య‌ద‌ర్శి సురేశ్ ఆచార్య తెలిపారు. ల్యాండింగ్ స‌మ‌యంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో మంట‌లు వ్యాపించిన‌ట్లు అనుమానిస్తున్నారు. సోమవారం మ‌ధ్యాహ్నం 2.20 నిమిషాల‌కు ఈ ఘోర ప్ర‌మాదం సంభవించింది. అనేక మంది ప్ర‌యాణికులు మంట‌ల్లో కాలి బూడిదైన‌ట్లు తెలుస్తున్న‌ది. చనిపోయిన వారి ఆచూకీలు కూడా కనిపెట్టడం కష్టతరంగా ఉందని విమాన ఆశ్రయ అధికారులు వెల్లడించారు.

  •  
  •  
  •  
  •  

Comments