మేన మామ చూపిన బాటలో నడుస్తున్న బన్నీ…!!

Tuesday, November 8th, 2016, 01:02:21 PM IST

pawan-allu-arjun
తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోగా నటిస్తూ రాబోయే చిన్న సిమాలను ప్రోత్సహించడం ఆయన నిడారంబరతకు ప్రత్యక్ష నిదర్శనం. దీనికి ఉదాహరనే ఈ సంఘటన. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో చిన్న చిన్న సినిమాల ఆడియో విడుదలకు, ఫంక్షన్లకు హాజరవుతూ సినిమా పరిశ్రమలో అందరం సమానులమే అన్న భావన కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ ను తన మేనల్లుడు అల్లు అర్జున్ కూడా అనుసరిస్తానని, మా మేన మామా చూపిన బాటలోనే నడుస్తున్నాడు. రెండు చిన్న సినిమాల వేడుకలకు బన్నీ హాజరు కానున్నాడు. నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల పాటల పండుగకు బన్నీ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేయనున్నాడు.