విజయ్ కు కొండంత అండగా బన్నీ ఫ్యాన్స్..!?

Friday, November 16th, 2018, 09:16:29 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా ప్రియాంకా జవల్కర్ హీరోయిన్ గా నూతన దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “టాక్సీవాలా” నిజానికి ఎప్పటికో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆ మధ్య మొత్తం సినిమా అంతటిని పైరసీ భూతం కమ్మేసింది.దీనితో వీరి చిత్ర యూనిట్ ఒక్క సారిగా షాక్ కి గురయ్యారు.సినిమా మొత్తం బయటకి వచ్చేసినా సరే విజయ్ మాత్రం తన సినిమాని మాత్రం దర్శకుని మీద నమ్మకం ఉంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసి చూపిస్తానని తెలిపాడు.

అయితే ఇప్పటికే పైరసీ అయిన ఈ చిత్రం పై టాలీవుడ్ అగ్ర తారలు అందరు వారి అభినందనలు తెలిపారు.ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే..అప్పుడు బన్నీ విజయ్ కు ఎంతలా తన సపోర్ట్ ని అందించాడో కూడా అందరికి తెలుసు.ఇప్పుడు తమ అభిమాన నటుని యొక్క బాటలోనే అభిమానులు కూడా నడుస్తున్నారు.రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని దానికి మేము అండగా నిలబడతామని బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.